భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి/భోగాపురం, 01 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంప్రారంభించారు. ఈ విమానాశ్రయం ప్రారంభం రాష్ట్ర విమానయాన రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. విశాఖపట్నానికి సమీపంలో వ్యూహాత్మకంగా నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను మరింతగా పెంపొందించడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునివ్వనుంది. సుమారు రూ.5,640 కోట్లకు పైగా వ్యయంతో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి...