ప్రశాంతంగా నీట్ పి.జి పరీక్ష

గుంటూరు, 30 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ :  గుంటూరు జిల్లాలో NEET-PG–2026 పరీక్ష  ప్రశాంతంగా ముగిసింది. కంప్యూటర్ ఆధారిత విధాన పరీక్షకు ఆరు కేంద్రాల్లో 796 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. ఆదివారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ,, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.