ప్రజా విజ్ఞాన ఉద్యమ మార్గదర్శి డా. ఎం. పి. పరమేశ్వరన్‌కు ఘన నివాళి

హైదరాబాద్: ప్రముఖ అణు శాస్త్రవేత్త, రచయిత, విద్యావేత్త, ప్రజా విజ్ఞాన ఉద్యమకారుడు డా. ఎం. పి. పరమేశ్వరన్ మృతి పట్ల కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ (సీసీజీజీఓఓ) జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డా. పరమేశ్వరన్ విజ్ఞానాన్ని ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాలకే పరిమితం చేయకుండా సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ (కేఎస్ఎస్ పీ) ను ప్రజా విజ్ఞాన ఉద్యమంగా బలోపేతం...