ప్రజలకు పౌర సేవలను ప్రతి అధికారి బాధ్యతాయుతంగా అందించాలి
ప్రభుత్వ పధకాల అమలు, కార్యదర్శుల పనితీరుపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిఎంసి కమిషనర్ గుంటూరు, 06 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డుల వారీగా ప్రభుత్వ పధకాల అమలు, కార్యదర్శుల పనితీరును జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నియమింపబడిన ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...