BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 1:54 pm Posted by : BHARATH PRATHINIDHI

పేదలకు పథకాలు అందించడమే ధ్యేయం

పలాస, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరును పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. మండలంలోని సున్నాడలో ఇంటింటికి తెలుగుదేశం కార్య క్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వసంక్షేమ పథకాల గురించి అడిగితెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు.