BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 2:28 pm Posted by : BHARATH PRATHINIDHI

పెదకూరపాడు వై‌సి‌పి నాయకుల ఆధ్వర్యంలో DSC అక్రమాలపై రిలే నిరాహార దీక్ష

సీబీఐ విచారణ చేపట్టి – మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ హోరేత్తిన నినాదాలు

పెదకూరపాడు, 06 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి, వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ శాసనసభ్యులు నంబూరు శంకరరావు ఆదేశాల తో గురువారం పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డి‌ఎస్‌సి అక్రమాలపై రిలే నిరాహార దీక్ష తొలి రోజు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని డి‌ఎస్‌సి లో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేసి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు దీక్షలో పాల్గొన్న సభ్యులు నిమ్మరసం తీసుకొని దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి, క్రోసూరు, బెల్లంకొండ మండలాలకి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.