పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక ‘స్పోర్ట్స్ థీమ్’ పార్కులు

గుంటూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను పిల్లలు ఆడుకోవడానికి వీలుగా, ప్రత్యేక 'స్పోర్ట్స్ థీమ్' పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం ఉద్యోగనగర్, వేణుగోపాల్ నగర్, మధురా నగర్, బాపయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితర ప్రాంతాల్లో జిఎంసి ఖాళీ స్థలాలను పరిశీలించి, అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువగా డిజిటల్ పరికరాలకే పరిమితమవుతున్నారని, వారి శారీరక దారుఢ్యానికి...