BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 6:49 am Posted by : BHARATH PRATHINIDHI

న్యాయం జరిగే వరకూ న్యాయ పోరాటం చేస్తాం : అంబటి రాంబాబు

గుంటూరు, 11 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : తన పై అక్రమ కేసులు పెట్టి వేధించాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై ఏఐ మార్ఫింగ్ వీడియోలతో కించపరుస్తున్నారని చెప్పారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారని అన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ను కలిసి 3 వేరువేరు వినతి పత్రాలు అందజేసి, ఫిర్యాదు చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ పై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మాత్రమే పోస్ట్ పెట్టడం జరిగిందని తెలిపారు. తన ఇంటిపై దాడి చేసిన కారణంగానే ఆ పోస్ట్ పెట్టడం జరిగిందని అంబటి వివరణ ఇచ్చారు. అయితే తనపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు తాను చేసిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఒక నేరంకు సంబంధించి ఒక కేసు మాత్రమే పెట్టాలని, తన పై ఒక నిరం సంబంధిచి రెండు కేసులు బనాయించారని చెప్పారు. ఇది చట్ట విరుద్ధమని అన్నారు. అయితే టీడీపీ వారికి ఒక న్యాయం, మిగిలిన వారికి మరొక న్యాయం అనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం జరిగే వరకూ న్యాయ పోరాటం చేస్తానని అంబటి స్పష్టం చేశారు.