ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : గత నాలుగు రోజులుగా భారత్‌లో బంగారం ధరలు వరుసపెట్టి పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాల నడుమ మళ్లీ బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఆగస్టు 5న దేశంలో రూ.1,44,000గా ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర నాలుగు రోజుల్లో రూ. 8 వేల పైచిలుకు మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు (ఆగస్టు 9) ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,350గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,650 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,260 వద్ద ట్రేడవుతోంది.