నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో కలకలం

నంద్యాల క్రైమ్‌, 08 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని చిన్నారుల వార్డులో అర్ధరాత్రి సమయంలో ఓ అపరిచిత వ్యక్తి సంచరించిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించిన వ్యక్తి వార్డులోకి వచ్చి హల్‌ చల్‌ చేసినట్లు చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపించారు. చిన్నారుల వార్డులోకి అపరిచిత వ్యక్తి ప్రవేశించడంతో అక్కడ చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వార్డులో భద్రతా సిబ్బంది, నర్సుల పర్యవేక్షణ తగినంతంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల...