BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 2:14 pm Posted by : BHARATH PRATHINIDHI

తరగతులకు తగ్గ సామర్థ్యం ఉండేలా బోధించాలి : డీఈవో

గుంటూరు, 06 ఆగస్ట్ 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనిగండ్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోప్పరావురు, జిల్లా పరిషత్ లీప్ ఉన్నతపాఠశాల నిడమర్రులను గురువారం తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో విద్యార్థులు సామర్ధ్యాలను పరిశీలించి, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ, ఇప్పటి నుండియే విద్యార్థులకు తమ తరగతులకు తగ్గ సామర్థ్యాలు కలిగి ఉండే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని, ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. పాఠశాలలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనాన్ని పాఠశాల లోని అందరు విద్యార్థులు భుజించే విధంగా తల్లిదండ్రులలో చైతన్యం కలిగించాలన్నారు. మూడు రోజులకు మించి పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల వివరాలను సంబంధిత తరగతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలియజేసి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.