తక్కువ ధరకే నాణ్యత గల బియ్యం పంపిణీ: అనగాని శివప్రసాద్

​చెరుకుపల్లి, 03 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : సామాన్య ప్రజలకు మేలైన ప్రయోజనాలు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అమ్మకం కేంద్రాలను ప్రారంభించిందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు అనగాని శివప్రసాద్ తెలిపారు. సోమవారం చెరుకుపల్లి మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి గ్రంధి సుబ్బారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ, రూ. 62 విలువై...