మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు
యువత, విద్యార్థులతో కిక్కిరిసిన దీక్షా శిబిరం
హోరెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు
శృంగవరపుకోట, 06 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు శృంగవరపుకోట మాజీ శాశన సభ్యులు కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహిస్తున్న AP Gen-Z WAR కార్యక్రమంలో భాగంగా, డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో జరిగిన అవకతవకలకు నిరసనగా ఎస్.కోట దేవిగుడి జంక్షన్లో ఎస్.కోట మండల నాయకులు ఆద్వర్యం లో నిరహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడుబండి మాట్లాడుతూ, డీఎస్సీ పరీక్షలు రాసిన వేలాది మంది యువత ఆశలను ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. అర్హత, ప్రతిభ ఆధారంగా జరగాల్సిన ఉపాధ్యాయ నియామకాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందుకే ఈ సిబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఆగదని, ప్రతి మండలంలో ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని కడుబoడిగారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి మమ్ములూరి వెంకటలక్ష్మి, మండలపార్టీ అద్యక్షులు మోపాడ కుమార్, నియోజవర్గం యువజన అద్యక్షుడు వాకడ సతీష్, నియోజవర్గం విద్యార్థి విభాగం అద్యక్షుడు దివాదరి శేఖర్, నియోజవర్గం సోషల్ మీడియా విభాగం అద్యక్షుడు యెడ్ల కిషోర్, మాజీ ఫోకే & కల్చురల్డైరెక్టర్ వకడ రాంబాబు, వైస్ ఎంపీపీ పినిశెట్టి వెంకటరమణ, నియోజవర్గం పంచాయితీ రాజ్ అద్యక్షుడు కునిరెడ్డి వెంకటరావు, మరియు మండలం లో ఉన్న యువత, విద్యార్ధులు, నిరుద్యోగ యువత, మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసి లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.