డీఎస్సీపై చర్చకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలి

జగన్‌కు మంత్రి సవిత సవాల్..! అమరావతి, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ 2025 నిర్వహణపై విషప్రచారం మానుకోకుంటే రాయలసీమ ప్రాంత ఉపాధ్యాయులంతా కదిలి సమరశంఖం పూరిస్తారని హెచ్చరించారు. కొండారెడ్డి బురుజు ఎక్కిన టీచర్లకు.. తాడేపల్లి ప్యాలెస్ ఎక్కడం పెద్ద లెక్క కాదని స్పష్టం చేశారు. ఒకరి కష్టాన్ని, ప్రతిభను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదని,...