గుంటూరు, 28 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా సురేష్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీమతి క్రిస్టినా నిరంతరం ప్రజాసేవలో కొనసాగుతూ, ఆయురారోగ్యాలతో, సంతోషంతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ద్వారా ప్రజలకు మరింత మేలైన సేవలందిస్తూ, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు.