జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ..!
హైదరాబాద్, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : బోనాల పర్వదినం వేళ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్‌ను దుండగుడు చోరీ చేశాడు. బాధిత మహిళ పూజలు చేస్తున్న సమయంలో ఆమె బ్యాగ్‌ను చాకచక్యంగా కత్తిరించాడు. ఆపై అందులోని పౌచ్‌ను అపహరించి అక్కడి నుంచి ఉడాయించాడు. పౌచ్‌లో ఐదు వెండి బిస్కెట్లు, రూ.5 వేలు ఉన్నట్లు బాధితురాలు వాపోయింది. బోనాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న దుండగుడు చోరీకి...