జర్నలిజంలో ఆరు నెలల డిప్లొమా కోర్సు

గుంటూరు, 06 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : అతి తక్కువ ఫీజు తో "జర్నలిజంలో డిప్లొమా కోర్సు" చేసే మంచి అవకాశాన్ని సి.ఆర్. మీడియా అకాడమీ అందిస్తోందని ఛైర్మన్ శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కోర్సు ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్టులకోసం ఉద్దేశించినదైనా, జర్నలిజం వృత్తిలో అభిరుచి కలిగిన డిగ్రీ ఉత్తీర్ణులైన సాధారణ అభ్యర్థులు కూడా ఈ డిప్లమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు...