గుంటూరు లక్ష్మీపురంలో ట్రాక్టర్ బీభత్సం
గుంటూరు, 30 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని లక్ష్మీపురం HDFC బ్యాంక్ ఎదురుగా ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఢీకొన్న కారు మరో కారును ఢీకొనడంతో వరుసగా వాహనాలు ఢీకొన్నాయి. దీంతో రోడ్డుపై ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రమాదం కారణంగా లక్ష్మీపురం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని...