BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 2:00 am Posted by : Raghunath Rolla

గుంటూరు లక్ష్మీపురంలో ట్రాక్టర్ బీభత్సం

గుంటూరు, 30 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు నగరంలోని లక్ష్మీపురం HDFC బ్యాంక్‌ ఎదురుగా ఆదివారం సాయంత్రం ట్రాక్టర్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఢీకొన్న కారు మరో కారును ఢీకొనడంతో వరుసగా వాహనాలు ఢీకొన్నాయి. దీంతో రోడ్డుపై ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రమాదం కారణంగా లక్ష్మీపురం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీంతో కొంతసేపటి తర్వాత వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.