గుంటూరులో రెవెన్యూ ఉద్యోగులకు మెగా ఉచిత వైద్య శిబిరం

గుంటూరు, 22 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ సి యం. సాయి కాంత్ వర్మ అన్నారు. రెవెన్యూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శనివారం గుంటూరు నగరంలోని బిఆర్ స్టేడియంలో రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వీఆర్వో స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు...