BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 1:23 pm Posted by : BHARATH PRATHINIDHI

గుంటూరులో ఘోర ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

గుంటూరు, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఏటుకూరు బైపాస్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో యువతి ఆసిఫా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. నల్లపాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.