ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి
ఐక్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం: బొప్పరాజు వెంకటేశ్వర్లు గుంటూరు, 01 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి : ఏపీ జేఏసీ అమరావతి సంఘానికి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం శనివారం గుంటూరులోని రెవెన్యూ భవన్‌లో జరిగింది. సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే...