ఎయిమ్స్ లో రోగుల కష్టాలకు చెక్ ఎప్పుడు !
ఎమర్జెన్సీ అని వెళ్తే బెడ్ దొరకటం కలేనా?నిరాశతో ఇతర ఆసుపత్రులకు వెళుతున్న రోగులురిపోర్టుల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిందేరోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిజర్నలిస్టులకూ తప్పని తిప్పలు మంగళగిరి, 07 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) లో నిపుణులైన వైద్యులతో పాటు ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ పలు సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. రోగులు పెరుగుతున్న స్థాయిలో వైద్యులను, సిబ్బందిని, మెడికల్ షాప్ కౌంటర్లను,...