ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో రోడ్డు ప్రమాదం..

ఇంటర్ విద్యార్థి మృతి ఇబ్రహీంపట్నం, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిగా సమాచారం. స్థానిక ఐశ్వర్య గ్రౌండ్స్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న ఈ యువకుడి తండ్రి గొల్లపూడి సాయిపురం కాలనీలోని సాయిబాబా ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా...