BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 3:43 pm Posted by : BHARATH PRATHINIDHI

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో రోడ్డు ప్రమాదం..

ఇంటర్ విద్యార్థి మృతి

ఇబ్రహీంపట్నం, 09 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిగా సమాచారం. స్థానిక ఐశ్వర్య గ్రౌండ్స్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న ఈ యువకుడి తండ్రి గొల్లపూడి సాయిపురం కాలనీలోని సాయిబాబా ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కన్న కొడుకును కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. యువకుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు. తమ విషాదాన్ని మరొకరి జీవితాల్లో వెలుగులు నింపేలా మార్చేందుకు కుటుంబం తీసుకున్న నిర్ణయం పలువురిని కదిలించింది.