BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 6:30 pm Posted by : BHARATH PRATHINIDHI

ఆశావర్కర్ల సమస్యల పై రాష్ట్రవ్యాప్త ఉద్యమం

.
ఏఐటీయూసీరాష్ట్రప్రధాన కార్యదర్శి ఎస్ . వెంకటసుబ్బయ్యపిలుపు

రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లను నిర్లక్ష్యం చేస్తూ వారి చేత వెట్టిచాకిరి చేయిస్తూ కనీస వేతనాలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య మండిపడ్డారు. ఈరోజు ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశం గుంటూరు, కొత్తపేట, మల్లయ్యలింగం భవన్ నందు యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎల్ . శాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వెలుగూరిరాధాకృష్ణమూర్తి , ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శికోటమాల్యాద్రి గుంటూరు జిల్లా అధ్యక్షులు రావుల అంజిబాబు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా s. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆశా కార్యకర్తలకు పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సామాజిక భద్రత సౌకర్యాలు లేవని ఆశా వర్కర్స్ కు అధిక యాపులు పెట్టి వారి చేత వెట్టిచాకిరి చేస్తున్నారని. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్లకు అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని. కానీ ఇంతవరకు వారి సమస్యలు వినడానికి కూడా ఇష్టపడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆశా కార్యకర్తలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని, అర్హత ఉన్నా ఆశ వర్కర్లను ఏఎన్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలని. ఆశా కార్యకర్తలు తయారు చేస్తున్న రికార్డులు ప్రభుత్వమే సరఫరా చేయాలని ముఖ్యంగా పాత బకాయిలు లెప్రసీ టీవీ కరోనా మొదలగు బకాయలు విడుదల చేయాలని ఆశ వర్కర్లకు చనిపోతే మట్టి ఖర్చులకు ఇవ్వాలని ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ఒక్క సంవత్సరం సర్వీస్ వారికి కూడా గుర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ఎస్సార్ మెయింటైన్ చేయాలని అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని రాష్ట్ర నాయకులకు ప్రొటెక్షన్ ఇవ్వాలని అదనపు డ్యూటీలు అనగా ఓట్లు నమోదు, ఎలక్షన్ వంటి డ్యూటీలకు అదనపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వెలుగురిరాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వం కచ్చితంగా దిగిరాక తప్పదని ఇటీవల కాలంలో ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం దేశ ప్రధానిని సైతం దిగొచ్చేలా చేసిందని ముఖ్యంగా ఇటీవల రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులు దృఢంగా పోరాడుతున్నారని ఆశ వర్కర్లు వారి న్యాయమైన కోరికలకు ఉద్యమించి తీరాలని అప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశ వర్కర్ అంతా ఏఐటీయూసీ జెండా నీడన బలమైన ఉద్యమాలు సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర మహాసభల్లో ఎన్నికైన నాయకత్వం అనారోగ్యం వల్ల కొంతమంది తగ్గినందున చేర్పులు మార్పులు చేపట్టడం జరిగింది. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) గౌరవ అధ్యక్షులుగా ఎస్ వెంకటసుబ్బయ్య, రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులుగా గుంటి వేణుగోపాల్, ఎల్ శాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రమీ జాబి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ చాముండేశ్వరి, కోశాధికారి యు మరియమ్మ, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు11 మందితో ఆఫీస్ బేరర్లు 60 మంది సమితి సభ్యులు మొత్తం 71 మందితో రాష్ట్ర సమితి ఎన్నుకోవడం జరిగినది. ఉపాధ్యక్షులుగా. వేదవతి, చందా మరై,సహాయ కార్యదర్శులు గా. రత్న,కె. కల్పన, కుమారి జిల్లాల నుంచి ఐదు మందిచొప్పున ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు జి వేణుగోపాల్ మాట్లాడుతూ ఆగస్టు 10వ తేదీ కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక రైతు ప్రజా సమస్యల పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయాల వద్ద జరుగు ఆందోళన కార్యక్రమాన్ని, ఆగస్టు 18వ తేదీ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఏఐటిసి అనుబంధ రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కనీస వేతనం 26వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ శాంతి నాయకురాలు చాముండేశ్వరి వేదవతి కల్పన మరియమ్మ రత్నమ్మ హేమ అమ్ములు శాంతమ్మ మొదలగు నాయకురాలు పాల్గొనడం జరిగింది.