BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 3:31 am Posted by : BHARATH PRATHINIDHI

‘ఆరా బ్యూటీ’ స్టూడియో ఘనంగా ప్రారంభం

గుంటూరు, 09 ఆగస్టు 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : గుంటూరు స్థానిక లక్ష్మీపురంలో ప్రముఖ బ్యూటీషియన్ సాయిశ్రీ కొప్పిశెట్టి ఆధ్వర్యంలో ఆధునిక, అత్యాధునికమైన సదుపాయాలతో ఏర్పాటుచేసిన ‘ఆరా బ్యూటీ’ స్టూడియోను గుంటూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్ పర్సన్, జనసేన గుంటూరు నగర అధ్యక్షురాలు శ్రీమతి బిట్రగుంట మల్లిక ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యూటీషియన్ సాయిశ్రీ కొప్పిశెట్టి స్టూడియోలో ఏర్పాటు చేసిన వివిధ మౌలిక వసతులను కలయ తిరిగి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీమతి బిట్రగుంట మల్లికా మాట్లాడుతూ గతంలో అందం కోసం బ్యూటీ పార్లర్ కు వెళ్లేవారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందంతోపాటు ఆరోగ్యం కోసం నేడు ఎక్కువమంది బ్యూటీ పార్లర్ కు వెళుతున్నట్లు చెప్పారు. పూర్వం జుట్టు రాలిపోతున్నా. మచ్చలొచ్చినా అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు వాటికి అత్యాధునికమైన వైద్యం అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆరా బ్యూటీ స్టూడియో అధినేత, బ్యూటీషియన్ సాయిశ్రీ కొప్పిశెట్టి మాట్లాడుతూ ఆరా బ్యూటీ స్టూడియోలో లేటెస్ట్ అడ్వాన్స్డ్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్, బ్రైడల్ మేకప్, పార్టీ మేకప్ అన్ని ట్రీట్మెంట్లు నాణ్యమైన ధరలకే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆరా స్టూడియో ప్రారంభోత్సవం సందర్భంగా నెలరోజుల పాటు 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బ్యూటీషియన్లు, పుర ప్రముఖులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని బ్యూటీషియన్ సాయిశ్రీ కొప్పిశెట్టికి శుభాకాంక్షలు తెలియజేశారు.