BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 4:18 am Posted by : BHARATH PRATHINIDHI

అంబటి రాంబాబు అతిపెద్ద రాజకీయ బఫున్ : కొర్రపాటి నాగేశ్వరావు

కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు
పెమ్మసానిపై అంబటి ఏఐ వీడియోలను విడుదల చేయటం సిగ్గుచేటు
గుంటూరు జిల్లాలో వైసీపీ కనుమరుగు.. ఉనికి కోసమే అంబటి నీచపు పాట్లు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేత్రత్వంలో రాష్ట్రంలో సుపరిపాలన
జనసేన నేతలు కొర్రపాటి నాగేశ్వరావు, ఆళ్ళ హరి, చింతా రేణుకరాజు

గుంటూరు, 03 ఆగష్టు 2026, భారత్ ప్రతినిధి : తన మతిమాలిన వ్యాఖ్యలతో, వికృత చేష్టలతో వైసీపీ నేత అంబటి రాంబాబు రాష్ట్ర రాజకీయాల్లోనే అతిపెద్ద బఫున్ గా మారాడని పత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త కొర్రపాటి నాగేశ్వరావు విమర్శించ్చారు. కూటమి నేతలపై అసందర్భంగా, అకారణంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆయన వైసీపీ నేతల్ని హెచ్చరించారు. సోమవారం శ్రీనివాసరావుతోటలోని పార్టీ కార్యాలయంలో కొర్రపాటి నాగేశ్వరావు విలేకరులతో మాట్లాడారు. అవినీతికి, అక్రమాలకు, హత్యా రాజకీయాలకు, కులమత విద్వేషాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన వైసీపీ నేతలకు కూటమి నాయకుల్ని విమర్శించే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు జిల్లా అభివృద్ధి పధంలో దూసుకుపోతుందని అనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు వైసీపీని మరచిపోయారని ఉనికి కోసమే పెమ్మసాని చంద్రశేఖర్ పై ఏఐ వీడియోలు పెట్టి అంబటి శునకానందం పొందుతున్నాడని దుయ్యపట్టాడు. కూటమి పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని వైసీపీకి ఇక అధికారం కల్లే నని కొర్రపాటి వ్యాఖ్యానించ్చారు. తన ఇంటిపై జరిగిన దాడి సంఘటనను అంబటి రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించ్చారు. ఉపాసకులు చాగంటి కోటేశ్వరరావు, గరికిపాటి నరసింహారావులు చెప్పినట్లు అంబటి రాంబాబు ప్రవచనాలు చెబితే దాడులు చేయలేదని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అసభ్యంగా మాట్లాడినందుకే వీపు విమానం మోత మోగించారని ఎద్దేవా చేశారు. అంబటి ఇంటిపై దాడికి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఎలాంటి సంభందం లేకపోయినా పదే పదే ఆయన్ని విమర్శించటం అంబటి కు సంస్కారానికి నిదర్శనమన్నారు. పెమ్మసాని పై ఏ ఐ వీడియోలు, ఫోటోలు, పాటలు క్రియేట్ చేసి ఇంస్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో విడుదల చేసి అంబటి పైశాచికంగా వ్యవహారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటిపై ఏ ఐ ని అడిగితే ఏ సర్టిఫికెట్ చిత్రాలు , వీడియోలు పంపిస్తుందన్నారు. తాము అన్నం తింటున్నామని, తమకు సభ్యతా సంస్కారాలు ఉన్నాయని అందుకే వాటి జోలికి పోవటం లేదన్నారు పెమ్మసాని సంపాదన గురించి అంబటి తరచూ వ్యాఖ్యానించటం పట్ల అయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెమ్మసాని తాను కష్టపడి సంపాదించుకున్న జ్ఞానాన్ని, మేధస్సును పంచి సంపాదించు కున్నారని, వైసీపీ నేతల్లా నిలువెల్లా అవినీతి మయం అయింది కాదన్నారు మరో మూడేళ్ళలో గుంటూరు పార్లమెంట్ ను కూటమి నేతలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండేలా కృషి చేస్తున్నారని ఆళ్ళ హరి అన్నారు. లేబర్ సంక్షేమ బోర్డు డైరెక్టర్ చింతా రేణుకరాజు మాట్లాడుతూ కాపు కులానికే అంబటి రాంబాబు మాయని మచ్చలా తయారు అయ్యాడన్నారు. జగన్ రెడ్డి దగ్గర కుక్కలా ఉంటానని బహిరంగంగా చెప్పిన అంబటికి కాపు కులంలో చోటు లేదన్నారు. కాపుల ఔన్నత్యాన్ని, ఆత్మభిమానాన్ని దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేసిన అంబటిని కాపు కులం ఎప్పుడో వెలేసిందని చింత రాజు అన్నారు.