అంబటి రాంబాబుపై సీఐడీ కేసు !

గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి : వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంకెళ్లు వేసినట్లు ఆయన అభ్యంతరకర వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పెమ్మసానిని కించపరిచేలా, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించిన అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌, మంగళగిరిలోని సీఐడీ అదనపు డీజీ కార్యాలయంలో ఎస్పీ...