BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 3:02 pm Posted by : BHARATH PRATHINIDHI

హిందూ ధర్మ రక్షణకు ప్రతి గ్రామంలో ధార్మిక సమితులు ఏర్పాటు చేయాలి

: సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర ప్రముఖ్ కొండారెడ్డి

​బాపట్ల జిల్లా చెరుకుపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశంలో ఫౌండేషన్ రాష్ట్ర ప్రముఖ్ కొండారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండల కన్వీనర్లు హిందూ ధర్మంపై అవగాహన పెంచుతూ, ప్రతి గ్రామంలో అర్చకులు, కుల పెద్దలు, పురోహితులు, భజన గురువులు మరియు దేవాలయ కమిటీ సభ్యులతో కలిపి 22 మందితో గ్రామ ధార్మిక సమితులను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమితుల ద్వారా వారం వారం భజనలు, సత్సంగాలు, సామూహిక హారతులు నిర్వహిస్తూ ధర్మ రక్షణకు కృషి చేయాలన్నారు. అలాగే టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వాడల్లో 820 దేవాలయాలను నిర్మించి, ఆయా వర్గాల వారికే టీటీడీ ద్వారా అర్చక శిక్షణ ఇప్పించి, రూ. 5,000 గౌరవ వేతనంతో అర్చకులుగా నియమిస్తున్నామని తెలిపారు. హిందువులందరూ కులభేదాలు మరిచి ధర్మ పరిరక్షణకు ఏకమవ్వాలని ఆకాంక్షించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా నేతలు పొన్నపల్లి సత్యనారాయణ, రాయపూడి అంకమ్మ చౌదరి, బొలగాని విజయలక్ష్మి, జంజనం హేమశంకరరావు తదితరులు పాల్గొన్నారు.