BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 5:34 am Posted by : BHARATH PRATHINIDHI

సీ.జీ.హెచ్.ఎస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ల కు అభినందన

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీ.జీ.హెచ్.ఎస్ ) గుంటూరు వెల్నెస్ సెంటర్ లో సీనియర్ మెడికల్ ఆఫీసర్లు గా సేవలందిస్తున్న డాక్టర్ కొండా నాగార్జున, డాక్టర్ దాసరి రమేష్ లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు (సీ.ఎం.ఓ) గా పదోన్నతి పొందిన సందర్భంగా గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ లో పనిచేసిన రిటైర్డ్ అధికారి, పూర్వపు సీ.ఎం.ఓ డాక్టర్ టి.సీహెచ్. కోటేశ్వరరావు గురువారం నగరంపాలెంలోని సీ.జీ.హెచ్.ఎస్ కార్యాలయంలో ఇరువురు డాక్టర్లను అభినందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ..ఏ వెల్నెస్ సెంటర్ లో లేని విధంగా, గుంటూరులో ఇద్దరు సీ.ఎం.ఓ లు పనిచేయడం అరుదైన విషయమని, ఇద్దరు డాక్టర్లు కలిసి గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ ను సేవలలో మేటి గా నిలపాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సీ.జీ.హెచ్.ఎస్ పై నమ్మకాన్ని మరింత పెంచేలా సేవలందించాలన్నారు. ఎంపానల్డ్ ఆసుపత్రులతో మాట్లాడి, ప్రతి పేషంట్ కు మరింత ఆరోగ్య సంరక్షణ అందేలా కృషి చేయాలని ఆయన సూచించారు.
డాక్టర్ కొండా నాగార్జున, డాక్టర్ దాసరి రమేష్ లు మాట్లాడుతూ గుంటూరు సీ.జీ.హెచ్.ఎస్ కు ప్రతిరోజు అధిక సంఖ్యలో లబ్దిదారులు వస్తున్నప్పటికీ, ఓర్పు, సహనంతో రోగులకు సేవలందిస్తున్నట్లు చెప్పారు. రిటైర్డ్ డాక్టర్లు సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోకల్ ఎడ్వైజరీ కమిటీ మెంబర్లు కట్టా వెంకటేశ్వర్లు, గుమ్మడి సీతారామయ్యచౌదరి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ హేమ సుందరి ఫార్మాసిస్టులు లక్ష్మీ కౌసల్య, సునీల్ వైద్య సిబ్బంది పేరేశ్వరరావు, మురళీ, రామారావు పాల్గొన్నారు.