‘వందేమాతరం’ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, 29 జులై 2026, భారత్ ప్రతినిధి : జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ నెల 24వ తేదీన ఎగువసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. నేడు (బుధవారం) సుదీర్ఘ చర్చ అనంతరం సభ ఆమోదముద్ర వేసింది. ఇకపై వందేమాతరాన్ని అవమానించినా, లేదా ఎవరైనా ఆలపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా దాన్ని చట్టప్రకారం తీవ్ర నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. వందేమాతరం బిల్లులో భాగంగా చరిత్రాత్మక...