రాష్ట్రస్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు, 29 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాజధాని ప్రాంతంలోని పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్రస్థాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను, అధికారులకు కేటాయించాల్సిన బాధ్యతలను సమీక్షించారు....