రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం..!

భారత్‌, చైనాపై 100 శాతం సుంకాలు.. ఇంటర్నెట్ డెస్క్, భారత్ ప్రతినిధి : రష్యాపై మరింత కఠిన ఆర్థిక ఆంక్షలు విధించే కీలక బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే, రష్యా నుంచి భారీగా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభించనుంది. ఈ బిల్లును దివంగత సెనెటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంటాల్ కలిసి రూపొందించారు....