‘యాంటీ పేపర్ లీక్’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూడిల్లీ, 29 జూలై 2026, భారత్ ప్రతినిధి : పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. చర్చల అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. బిల్లులో మార్పులు చేయాలంటూ విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను తిరస్కరించింది. పశ్నపత్రాల లీకేజీ, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడడమే బిల్లు లక్ష్యమని ప్రభుత్వం...