ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన GMC కమిషనర్ కె. మయూర్ అశోక్
అల్లూరి సీతారామరాజు (ASR) అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి విచ్చేస్తున్న తరుణంలో GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ విమానాశ్రయ పరిసరాలలో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కింగ్ సదుపాయాలు: సభకు విచ్చేసే ప్రజలు, అధికారుల వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ ప్రాంగణాల పర్యవేక్షణ, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, పారిశుధ్యం లోపించకుండా తాగునీరు, తగినన్ని తాత్కాలిక టాయిలెట్ల సదుపాయం పై అధికారులకు సూచనలు చేశారు. సభా ప్రాంగణం (స్టేజ్): గౌరవ ప్రధాని పాల్గొనే ప్రధాన వేదిక (Stage) డిజైన్, లైటింగ్, మరియు విఐపి ఏర్పాట్ల...