“డ్రగ్స్ వద్దు బిడ్డ” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్‌కు క్లాప్ కొట్టిన గుంటూరు ఎస్పీ

గుంటూరు, 30 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యపరిచే లక్ష్యంతో రూపొందిస్తున్న "డ్రగ్స్ వద్దు బిడ్డ" థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ చిత్రీకరణను గురువారం తెనాలి గాంధీచౌక్ కూడలిలో ఘనంగా ప్రారంభించారు. సినీ దర్శకుడు దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సందేశాత్మక లఘు చిత్రానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ కెమెరా స్విచ్ ఆన్ చేసి తొలి సన్నివేశాన్ని ప్రారంభించారు....