BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 12:43 pm Posted by : BHARATH PRATHINIDHI

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: నూరి ఫాతిమా

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ ఆందోళన.జేసీకి వినతి..

గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ గుంటూరు జాయింట్ కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, నూరి ఫాతిమా శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి నూరి ఫాతిమా మీడియాతోమాట్లాడారు. మెరిట్ జాబితాలో పేర్లు వచ్చిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. స్పోర్ట్స్ కోటాలో సుమారు 400 పోస్టుల్లో అక్రమాలు జరిగాయని ఉద్యోగాల పేరుతో రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు కాల్ రికార్డులు ఉన్నాయని ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని విచారణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని అన్నారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నామని జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని తెలిపారు. డీఎస్సీ వ్యవహారంలో న్యాయం జరిగే వరకు టౌన్‌హాల్ సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.