BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 10:04 am Posted by : BHARATH PRATHINIDHI

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి !

వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్

ప్రజలతో కలిసి వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతం

డీఎస్సీ అక్రమాలపై సిబిఐ తో సమగ్ర విచారణ జరిపించాలని గొంతెత్తిన విద్యార్థులు

అమరావతి, 29 జూలై 2026, భారత్ ప్రతిదీ న్యూస్ : డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ప్రజలతో కలిసి వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ర్యాలీలు విజయవంతం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యువత విద్యార్థుల డిమాండ్లను సాధించే క్రమంలో వారి భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర సాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ర్యాలీలో పాల్గొన్న యువత విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్సిపి నిర్వహించిన ర్యాలీల వీడియోలను జతచేస్తూ ‘నారా లోకేష్ మస్త్ రిజైన్’ హాస్టల్లో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్ జెడ్ ఆగ్రహ వేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది ప్రజలతో కలిసి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన వివాహాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్ని విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టులు భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థులు స్పష్టం చేశారు.