గిట్టుబాటు కాదని పడేస్తున్న రైతులు
అనంతపురం, 29 జూలై 2026, భారత్ ప్రతినిధి : టమోటా రైతులకు ఈసారి ఆదిలోనే హంసపాదు అన్న పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికొచ్చిన సమయంలో ధరల పతనం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితులు తలకిందులు కావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా కనిపించలేదని కన్నీరుపెడుతున్నారు. కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోతోందని వాపోతున్నారు. చేసేదిలేక పంటను తోటలోనే వదిలేయడం, లేదంటే రోడ్లపక్క పారబోసే దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి.
నాడు కలకల.. నేడు వెలవెల
గత ఏడాది సీజన్ ప్రారంభంలో కక్కలపల్లి టమోటా మార్కెట్‌లో కిలో గరిష్ట ధరలు రూ.30 నుంచి రూ.40 మధ్య పలికాయి. 15 కిలో బాక్సుకు రూ.450 నుంచి రూ.600 వరకు లభించింది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఈసారి ముందస్తుగానే పంట సాగు చేశారు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. ప్రస్తుతం కిలో గరిష్ట ధర రూ.10 నుంచి రూ.12మధ్య ఊగిసలాడుతోంది.
తగ్గిన ఎగుమతులు
ధరలు పతనానికి ఎగుమతులు మందగించడమే ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు అంటున్నా యి. ఉమ్మడి జిల్లాలో సుమారు 23వేల హెక్టార్లలో టమోటా సాగులో ఉన్నట్లు సంబంధిత అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 20శాతం కోత ద శలో ఉందంటున్నారు. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో కాయలు మార్కెట్ పెద్ద ఎత్తు న వస్తున్నాయి. అనంతపురం కక్కలపల్లి ప్రైవేట్ మార్కెట్‌కు రోజుకు మూడువేల టన్నులకు పైగానే కాయలు వస్తున్నాయి. కళ్యాణదుర్గం మార్కెట్‌కు కూడా బాగానే వస్తున్నాయి. ఎగుమతులు లేకపోవడం ధరలు లేకపోవడానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.