BHARATH PRATHINDIHI
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 1:28 pm Posted by : BHARATH PRATHINIDHI

జర్నలిస్టుల సమస్యలపై జేసీకి వినతి పత్రం అందించిన జర్నలిస్టు సంఘాలు

గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఏపీ బి జె ఏ) ప్రతినిధులు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవను కలిసి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు, పెన్షన్ పథకం అమలు, మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ బలోపేతం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, కార్మిక బీమా, జర్నలిస్టుల వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర మొత్తం 11 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని స్వీకరించిన జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ, జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరులోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.