ఐసీసీ ర్యాంకింగ్స్: వన్డేల్లో గిల్ టాప్..!
టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్ ఇంటర్నెట్ డెస్క్: వన్డే, టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రపంచ నంబర్ 1 బ్యాటర్‌గా అవతరించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్(801).. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్(794)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మూడు, నాలుగు స్థానాల్లో భారత వెటరన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ(767), రోహిత్ శర్మ(758) కొనసాగుతున్నారు. వైభవ్ విధ్వంసం! భారత యువ సంచలనం...