ఎస్‌ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
గుంటూరు, 31 జూలై 2026, భారత్ ప్రతినిధి న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శుక్రవారం విడుదల చేశారని, ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు లేదా సవరణలు అందించేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించారని గుంటూరు తూర్పు ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ముసాయిదాపై అందిన అభ్యంతరాలను జూలై 31 నుండి సెప్టెంబర్ 28...